సామెత- దాని అర్థం

సామెత- దాని అర్థం

'దూప అయినప్పుడే బావి తవ్వుకున్నట్లు'

భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలూ లేనివ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. ఆ పూట గడిస్తే చాలనుకుంటారు. రేపు అలాంటి సమస్యే మరొకటి వస్తే 'మళ్లీ వచ్చినప్పుడు చూద్దాం' అనుకునే రకం. ప్రతిదాన్నీ వాయిదా వేస్తుంటారు. తీరా నెత్తిమీదికొచ్చినప్పుడు నానా తంటాలు పడతారు. సరిగ్గా అలాంటి వారిని ఉద్దేశించి ఈ సామెత ఉపయోగిస్తారు.