'ప్రమాదాలు జరిగితే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి'
SRD: పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హైరిస్క్ ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యానికి, కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు.