INSPIRATION: జెట్టి ఈశ్వరీ బాయి

INSPIRATION: జెట్టి ఈశ్వరీ బాయి

అంబేద్కర్ ఆశయాలను ఆలంబనగా చేసుకొని, ఆఖరి శ్వాస వరకు ఆయన అడుగుజాడల్లో నడిచిన అంబేద్కరిస్ట్ ఈశ్వరీ బాయి. తెలుగు నేలపై సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం, అంటరాని తనాన్ని తరిమికొట్టి సమసమాజాన్ని స్థాపించాలని తపించి అలుపెరుగని పోరాటం చేసిన నీలి పోరాట కెరటం. ఒంటరి మహిళగా తనకు ఏ అండ లేకున్నా అభాగ్యులకు అండగా నిలబడ్డ ధీర వనిత.