బదిలీ అయిన కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు

బదిలీ అయిన కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు

AP: రాష్ట్రంలో 12 మంది కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే బదిలీ అయిన కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం పథకాలను ఉపయోగించుకోవాలని అన్నారు. అన్నింటికీ రూల్స్ చెప్పొద్దని.. అహంకారం వీడాలని సూచించారు. మానవీయ కోణంలో పనిచేయాలన్నారు. ఇతర జిల్లాల కలెక్టర్లతో పోటీపడాలని.. పనిచేసే కలెక్టర్లను ప్రోత్సహిస్తానని తెలిపారు.