నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించిన అడిషనల్ ఎస్పీ

నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించిన అడిషనల్ ఎస్పీ

కడప: లింగాలలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాశ్ బాబు శుక్రవారం పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ.. లింగాలలో నిర్మిస్తున్న కొత్త పోలీస్ స్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు.