సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వివిధ వైద్య, ఆరోగ్య అంశాలపై వైద్య అధికారులతో, మెడికల్ ఆఫీసర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి అధికారి పని చేయాలని ఆమె సూచించారు. రాబోయే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.