ఎల్లారెడ్డి మండలంలో స్వతంత్రుల అభ్యర్థుల హవా.!
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో 31 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 18 మంది స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ 9, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాల్లో గెలుపొందాయి. మొత్తం స్థానాల్లో స్వతంత్రులదే పైచేయి కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఓటర్లు పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్రులకు పట్టం కట్టారు