ఐదుగురు జూదరులు అరెస్ట్
ELR: టి.నరసాపురం మండలం తెడ్లెం గ్రామంలో గురువారం గుండాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై జయబాబు తెలిపిన వివరాల ప్రకారం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 3,500 నగదు, గుండాట బోర్డు, 6 డైస్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే వారిపై కేసు నమోదు చేశామన్నారు.