కొల్లాపురమ్మ విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే అమిలినేని
ATP: బ్రహ్మాసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో జరిగిన కొల్లాపురమ్మ దేవి విగ్రహ, కలశ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండాలని మొక్కుకున్నారు. ఆలయ కమిటీకి ఆయన తన వంతుగా విరాళం అందజేశారు.