VIDEO: మానసాదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు
KNR: గన్నేరువరం(M) ఖాసీంపేటలో స్వయంభుగా వెలిసిన మానసాదేవి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు మానసాదేవి, అపూరూపలక్ష్మి అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, ఆలయ కోనేరులో ఏర్పాటు చేసిన 108 జంట నాగ శివలింగాలకు జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమ కోరికలు నెరవేరాలని కోరుకున్నారు.