'నీళ్లు పారలేదు.. నిధులన్నీ ఒక కుటుంబానికి పారాయి'

TG: రాష్ట్రంలో నీళ్లు పారలేదని.. కానీ నిధులన్నీ ఒక కుటుంబానికి పారాయని CM రేవంత్ అన్నారు. సాగునీటి శాఖలో 15 నెలల్లోనే 1,161 మందిని నియమించామన్నారు. ఈ ప్రభుత్వానికి నీటిపారుదలశాఖ అత్యంత ప్రాధాన్యమైందని తెలిపారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్, శ్రీశైలంతోనే నీళ్లు అందుతున్నాయని చెప్పారు. రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిందని విమర్శించారు.