ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

CTR: పంటలు సాగుచేసే రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వ్యవసాయశాఖ ఏడీఏ శివకుమార్ తెలిపారు. మేలుపట్ల రైతుసేవా కేంద్రంలో బుధవారం డిజిటల్ శిక్షణా కార్యక్రమాన్ని రైతులకు నిర్వహించారు. రైతులు స్మార్ట్ ఫోన్ల వినియోగంతో పాటు, వ్యవసాయ సమాచారం తెలుసుకునే విషయంపై వివరించారు. ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ల ద్వారా రైతులు సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.