ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

VZM: ప్రజలకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాల కలయికను సూచిస్తాయని, ఈ నూతన సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయాలు సాధించాలని అన్నారు.