హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్: 2025 సంవత్సరంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులు దరఖాస్తులు చేసుకోవాలని హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తవక్కల్ సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సెప్టెంబర్ 9వరకు సమర్పించాలని తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం భూక్తాపూర్లోని హజ్ సొసైటీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందిస్తామన్నారు.