‘సైన్యంలో మరిన్ని సంస్కరణలు కావాలి ’

కోల్‌కతాలో జరిగిన కంబైన్డ్ కమాండర్ల సమావేశంలో PM మోదీ పాల్గొని ప్రసంగించారు. 'సంస్కరణల సంవత్సరం - భవిష్యత్తు కోసం పరివర్తన' అనే ఇతివృత్తానికి అనుగుణంగా.. సైనిక రంగంలో స్వావలంబన, ఆధునీకరణపై తీసుకుంటున్న చర్యలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ లాంటి సమయాల్లో సైన్యం పాత్రనుకొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు.