డ్రోన్ ద్వారా శాంతిభద్రతల పర్వేక్షణ
ప్రకాశం: పొన్నలూరు మండలం నాగిరెడ్డి పాలెంలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ నిఘా ఇవాళ నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఎస్సై సత్యనారాయణ డ్రోన్ ద్వారా గగనతలం నుంచి పరిశీలించారు. ఈ డ్రోన్ పర్యవేక్షణ ద్వారా అక్రమ కార్యకలాపాలు, అనుమానస్పద వ్యక్తుల కదలికలను గమనించవచ్చన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంతో నిఘా ఉంటుందన్నారు.