సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
RR: మన్సురాబాద్ డివిజన్‌లోని పవనగిరి కాలనీ ఫేజ్-3లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, నియోజకవర్గ అభివృద్దే తన ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.