అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు అంగన్వాడీ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన అక్షరాభ్యాసం, సామూహిక అన్న ప్రాసన కార్యక్రమంలో కౌన్సిలర్ వసంత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీలో బాలింత తల్లులకు, పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.