ఎన్నికల కమిషన్ నిబంధనలకు లిబడి వ్యవహరించాలి
ADB: సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి వ్యవహారించాలని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాంసి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీ, ఎంపీడీవో మోహన్ రెడ్డితో కలిసి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు సజావుగా సాగేలా చూడలన్నారు.