మాద ఎడవెల్లిలో రజనీకి బీజేపీ మద్దతు
NLG: నార్కట్‌పల్లి మండలం మాదఎడవెల్లి సర్పంచ్ అభ్యర్థి కందగట్ల రజినీకి బీజేపీ మద్దతు ప్రకటించింది. పాలనలో పారదర్శకత, గ్రామంలో వ్యవసాయ మార్కెట్, ఆట స్థలం, గ్రంథాలయం ఏర్పాటు, నైబాయికి రోడ్డు నిర్మాణం, మద్యపాన నిషేధం, బస్సు షెల్టర్ నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటుకు రజిని కృషి చేస్తానన్నారు. దీంతో బీజేపీ మద్దతు తెలిపింది.