పాలిసెట్ పరీక్షకు 117 మంది గైర్హాజరు

NRML: జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించిన పరీక్షకు 2305 విద్యార్థులు హాజరు కాగా 117 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్ష సమన్వయకర్త రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.