టీటీడీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి: కుందూరు

టీటీడీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి: కుందూరు

ప్రకాశం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని గిద్దలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బెస్తవారిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడు ప్రవర్తన మహిళల పట్ల అసభ్యకరంగా ఉందని అన్నారు. హిందువుల పవిత్రతను కాపాడేందుకు వెంటనే కూటమి ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్‌ని తొలగించాలన్నారు.