చెరువు కాదు.. బడే ఇది.!

చెరువు కాదు.. బడే ఇది.!

KMM: ఏన్కూరు మండలం భద్రుతండాలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం భారీ వర్షాల కారణంగా చెరువును తలపిస్తోంది. పాఠశాల రోడ్డు కంటే దిగువన ఉండటంతో వర్షపు నీరు ప్రాంగణంలోకి చేరుతోంది. దీంతో తరగతులకు వెళ్లడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలవుల అనంతరం సోమవారం పాఠశాల తెరిచేలోగా అధికారులు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.