'ఫుడ్ జిహాద్ పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు'
NDL: మేడారం జాతరలో నంద్యాలకు చెందిన చిరువ్యాపారి వలీని వేధించిన యూట్యూబర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం MIM చీఫ్ ఒవైసీ డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించడం, మత రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం రూ.10కి కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని 'ఫుడ్ జిహాద్' పేరుతో భయభ్రాంతులకు గురిచేశారన్నారు.