ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఎంపీడీవో

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఎంపీడీవో

VZM: ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని ఎంపీడీఓ పి. రవికుమార్ కోరారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం హర్ ఘర్ తిరంగ్ నిర్వహించి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ నెల 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతీయ నాయకులను గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు.