VIDEO: నెల్లూరుకు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ R&B అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 16, 17 నుంచి నగర వ్యాప్తంగా 7 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.