VIDEO: లారీ, కారు ఢీ.. ముగ్గరికి తీవ్ర గాయాలు

VIDEO: లారీ, కారు ఢీ.. ముగ్గరికి తీవ్ర గాయాలు

SKLM: పలాస మండలం నెమలి నారాయణపురం హైవేపై ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో డివైడర్‌ తో పాటు, లారీని కారు బలంగా ఢీకొట్టింది. పూరి దర్శనం అనంతరం పర్లాఖిమిండి వైపు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.