'మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం'
NZB: గ్రామీణ ప్రజలు, రైతులు, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల పరిధిలో మంగళవారం రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి పలు అభివృద్ధి ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలు చేపట్టారు.