తేజ సజ్జా ‘మిరాయ్’ మళ్లీ వాయిదా

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ మరోసారి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సెప్టెంబర్ 5న ఈ మూవీని విడుదల చేయాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల వారం పాటు వాయిదా వేసి సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనుంది.