ఉద్యమాలకు సిద్ధం కండి: ఎస్టీయూ

ఉద్యమాలకు సిద్ధం కండి: ఎస్టీయూ

NDL: పాఠశాల విద్యా పరిరక్షణకై రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎస్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న, నంద్యాల జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవన్‌లో వారు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే హేతు బద్దీకరణ ప్రక్రియ వలన ప్రభుత్వ పాఠశాల విద్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు.