శరవేగంగా అభివృద్ధి చెందతున్న విశాఖ

శరవేగంగా అభివృద్ధి చెందతున్న విశాఖ

VSP: విశాఖ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ హబ్‌గా, ఏఐ సిటీగా రూపాంతరం చెందుతుంది. అమెరికా వెలుపల గూగుల్‌ భారీ డేటా సెంటర్‌ను ఇక్కడే ఏర్పాటు చేయనుంది. అనుబంధంగా అనేక బహుళజాతి ఐటీ కంపెనీలు, పర్యాటక, సేవారంగ సంస్థలు విశాఖ నుంచే తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీంతో స్వదేశీ, విదేశీయులను నగరం ఆకర్షిస్తుంది. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.