యూనిఫామ్స్, పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

యూనిఫామ్స్, పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NRPT: నర్వ మండల పాతర్చేడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ అధికారులతో కలిసి విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, తద్వారా వారి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.