పర్యాటకులను ఆకర్షిస్తున్న భీమిలి
VSP: చారిత్రక పట్టణంగా ప్రసిద్ధిగాంచిన భీమునిపట్నంలో సహజసిద్ధ ప్రదేశాలు, ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కార్తీకమాసంలో నిత్యం వేలాది మంది వీటి సందర్శనకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తోట్లకొండ, బావికొండ, పావురాల కొండ, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్, పర్యటక కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. గోస్తనీ నదీ సాగర సంగమం ప్రాంతం మైమరిపిస్తుంది.