విద్యుత్ సరఫరాకు అంతరాయం
KDP: పులివెందుల పట్టణంలోని పలు ప్రాంతాల్లో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ AEE జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపడుతున్నందున సదాశివారెడ్డి హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలన్నారు.