శ్రీనివాసుని చిత్రపటం బహుకరణ

విశాఖకి చెందిన చిరుధాన్యాల చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఈరోజు చిరుధాన్యాలతో తయారు చేసిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని టీటీడీ ఏఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు. అరికలు, కొర్రలు, సామలు, నల్ల సామలు, రాగులు ఉపయోగించి 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పుతో ఈ చిత్రపటాన్ని 27 రోజుల్లో తయారు చేశారు.