రేపే పుష్పయాగానికి అంకురార్పణ

TPT: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మే 3న పుష్పయాగం జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు.