బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం
MNCL: మంచిర్యాల జోన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 1 నుండి జనవరి 1 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.