రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

WGL: పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ ఆధారంగా విచారణ చేపట్టారు. దేవాలయం తాళం పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లి మామిడి తోటలో ధ్వంసం చేశారు. భక్తులు సమర్పించిన నగలు, డబ్బులు అందులో ఉన్నాయని స్థానికులు తెలిపారు.