దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం
MHBD: తొర్రూరు మండలంలోని పోలేపల్లి శివారు తాన్య తండాలో దుర్గమ్మ గుడి అభివృద్ధి పనుల కోసం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ యాదవ్ రూ.50 వేలు భారీ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గుడి పనుల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని ఆకాంక్షించారు.