రంజీల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపులు
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. బీహార్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్.. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 67 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 93 పరుగులు చేసి, తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో అతడు బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం.