ఎన్నికల విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు
NRPT: ఈ నెల 17 తారీకు జరగబోయే మూడో విడత ఎన్నికలలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తప్పకుండా హాజరుకావాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని మక్తల్, మాగనూరు, నర్వ, కృష్ణ, ఊట్కూరు మండలాలలో ఎన్నికలకు హాజరుకావాలన్నారు.