VIDEO: ఘనంగా ముగిసిన శ్రీరామనవమి వేడుకలు
KMR: తాడ్వాయి మండలంలోని కరడుపల్లిలో శ్రీరామనవమి పురస్కరించుకొని 9 రోజులుగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు వచ్చిన శ్రీ కృష్ణ నంద స్వామి భగవద్గీత పారాయణం, ప్రవచనాలు బోధించారు. అనంతరం హనుమాన్ మందిరం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ఉత్సవమూర్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు