'స్వదేశీ వస్తువులనే వాడుదాం'

కర్నూలు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అవగాహన సదస్సులు నిర్వహించారు. విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం, స్వదేశీ వస్తువులనే వాడుదామని ఆర్ఎస్ఎస్ నేత డా. వాసు రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి పౌరుడు ఈ దిశగా చొరవ చూపాలని సూచించారు.