పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి పరీక్ష సందర్భంగా పురానిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కేంద్రాన్ని కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల తనిఖీ, సీసీ కెమెరాల పర్యవేక్షణను సమీక్షించారు. విద్యార్థులకు తాగునీరు, వెలుతురు, శౌచాలయ సదుపాయాలు కల్పించాలని సూచించారు.