మైనంపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన
NLG: సర్పంచ్ రాంసింగ్ నాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి ప్రసంగించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని వారు ప్రజలకు అవగాహన కల్పించారు.