కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ATP: గార్లదిన్నె మండలం కృష్ణాపురంలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మంగళవారం ఉదయం సందర్శించారు. ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.