బొక్కలగుట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
MNCL: మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్, లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, వారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.