మళ్లీ పెళ్లి చేసుకుంటా.. మీకేంటీ?: జాను లిరీ

TG: ఫోక్ డ్యాన్సర్ జాను లిరీ మరో వీడియో విడుదల చేసింది. తన ఫ్యామిలీ గురించి ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిపింది. అయితే ఈ ట్రోల్స్ ఆగవని తనకు తెలుసని.. తాను స్ట్రాంగ్ గర్ల్ అని పేర్కొంది. 'నేను మరో పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ప్రాబ్లమా..? నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నా. నేను, నా కొడుకు హ్యాపీగా ఉండటమే నాకు ఇష్టం' అని జాను క్లారిటీ ఇచ్చింది.