తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

PPM: గత ఐదు నెలలుగా తాగునీరు సరిగా అందటం లేదంటూ శుక్రవారం మక్కువ మండల కూరాకుల వీధి, నాయి బ్రాహ్మణ వీధి, జాలర వధి నుంచి వచ్చిన మహిళలు స్దానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. కనీసం ఇంటికి ఒక బిందె నీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన DE వారికి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.