జిల్లాలో డయేరియా మృతి.. ఇద్దరు అధికారులు సస్పెండ్
SKLM: నగరంలో డయేరియా ప్రబలిన ఘటనలో మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి సరఫరా విభాగం డీఈఈ జగన్మోహన్, దమ్మలవీధిలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శరత్‌ను విధుల నుంచి తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంఛార్జ్ ఈఈ కమలాకర్‌తో పాటు మరికొందరికి షోకాజ్ నోటీలుసు జారీ చేశారు.